ఫర్ ఛాలెంజింగ్ కెరీర్... సీడీఎస్
   అయిదంకెల జీతం.. సమున్నత హోదా.. సంఘంలో గౌరవం.. అన్నిటికీ మించి..  మాతృభూమికి సేవ చేసే సదవకాశం.. ఇవన్నీ కావాలనుకునే యువతకు సరైన దారి..  కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)! 
 ఆర్మీ,  నేవీ, ఎయిర్ ఫోర్స్.. దేశ రక్షణలో ఈ మూడు విభా గాలకు ఎనలేని ప్రాధాన్యత.  వాటిలో అడుగుపెట్టి దేశ సేవ చేయాలనుకునే యువత ఎందరో. కనీసం 'జవాన్' గానైనా  జనహితం కోసం పాటు పడితే చాలనుకునే వారు లెక్కకు మిక్కిలి. అంతటి  ప్రాధాన్యమున్న త్రివిధ దళాల్లో ప్రారంభంలోనే 'కమిషన్డ్ ర్యాంక్'లో అడుగు  పెట్టేందు కు.. సంఘంలో గౌరవం, చక్కటి ఆదాయం పొందేందుకు సరైన అవకాశం  కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.  
 నాలుగు అకాడెమీలు.. 522 ఖాళీలు :
  సీడీఎస్ పరీక్ష ద్వారా మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్, ఆఫీసర్స్ ట్రైనింగ్  అకాడెమీల్లోకి మొత్తం 522 మందికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో ఆఫీసర్స్  ట్రైనింగ్ అకాడెమీ మహిళల షార్ట్ సర్వీస్ కమిషన్‌లో 25 మంది మహిళల్ని ఎంపిక  చేయనున్నారు. ఆయా అకాడెమీల్లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్య 
 మిలటరీ అకాడెమీ: 250
 నేవల్ అకాడెమీ: 40
 ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ: 32
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఎస్‌ఎస్‌సీ-పురుషులు): 175
 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఎస్‌ఎస్‌సీ- మహిళలు): 25  
 ముందుగా ట్రైనింగ్ అకాడెమీల్లో :
  సీడీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్  ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎంపికైన వారికి ముందుగా త్రివిధ  దళాలకు చెందిన ట్రైనింగ్ అకాడెమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ కోసం ఇండియన్  మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్), నేవీ కోసం ఇండియన్ నేవల్ అకాడెమీ (కేరళ),  ఎయిర్ ఫోర్స్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి చెందిన వివిధ  ప్రాంతాల్లో., పురుషులు, మహిళల షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఆఫీ సర్స్  ట్రైనింగ్ అకాడెమీ (చెన్నై)లలో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఆయా  దళాల్లో కమిషన్డ్ ర్యాంక్ అధికారి హోదాలో నియామకం ఖరారు చేస్తారు.  
 దరఖాస్తు ఇలా :
  సీడీఎస్ పరీక్ష ఔత్సాహికులు.. నిర్దేశిత పోస్ట్ ఆఫీసుల్లో లభించే కామన్  అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి. దరఖా స్తులోనే తమకున్న ఆసక్తి ప్రకారం  ఆయా విభాగాలను ప్రాధాన్యతా క్రమంలో తెలియజేయాలి.  
 ఉదాహరణకు: ఆర్మీ  అకాడెమీకి ఆసక్తి ఉంటే దానిని ప్రాధా న్యతా క్రమంలో మొదటగా పేర్కొనాలి.  ఇలా అభ్యర్థులు పేర్కొన్న ఆసక్తి ప్రకారమే పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ఈ  విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ నాలుగు విభాగాల్లో తమకు సరితూగే  విభాగమేంటో ముందుగానే స్వీయ అంచనాకు రావడం సూచనీయం. పూర్తి చేసిన దర  ఖాస్తుకు * 100 ఫీజును సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీజ్ స్టాంప్ రూపంలో  దరఖాస్తులోని నిర్ణీత ప్రదేశంలో అతికిం చాలి. 
 ఇక దరఖాస్తులను  ఆన్‌లైన్‌లో పూర్తి చేసే అవకాశం కూడా యూపీఎస్సీ కల్పిస్తోంది. ఇందుకోసం  www.ups 
conline.nic.in వెబ్‌సైట్ వీక్షించాలి. అందులో నిర్ణీత నమూనాలోని  దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి * 50 ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా  లేదా ఎస్‌బీఐ చలానా రూపం లో చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులను  ప్రోత్సహించేం దుకు ఈ విధానాన్ని వినియోగించుకునే వారికి * 100 ఫీజు బదులు *  50 ని మాత్రమే వసూలు చేస్తున్నారు. 
 రాత పరీక్ష కంటే కఠినం.. ఎస్‌ఎస్‌బీ :
  రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అంతకంటే కఠినమైన ప్రక్రియను  ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో సిట్యుయేషన్  రియా క్షన్ టెస్ట్; థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్; వర్డ్ అసోసియే షన్  టెస్ట్; గ్రూప్ టెస్ట్ పేరిట అభ్యర్థుల్లోని మానసిక సామ ర్థ్యాన్ని, ధైర్య  సాహసాలను పరీక్షిస్తారు.ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదారు రోజులపాటు  సాగుతుందంటే దీని క్లిష్టత స్థాయి తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు  ఎదు ర్కోవాల్సిన అంశాలు: 
 సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్: నిర్ణీత  సంఘటనలకు సంబం ధించి 60 ప్రశ్నలు అడుగుతారు. కేవలం 30 నిమిషాల్లో వాటికి  సరైన పరిష్కారం కనుక్కోవాలి
 థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్: అభ్యర్థికి 12 దృశ్యాలను చూపిస్తారు. వాటికి సరితూగే విధంగా 36 నిమిషాల్లో ఒక కథ రూపొందించాలి. 
  వర్డ్ అసోసియేషన్ టెస్ట్: ఇందులో అభ్యర్థికి మొత్తం 60 పదాలిస్తారు. ప్రతి  పదాన్ని ఆధారం చేసుకుంటూ 60 అర్థ వంతమైన వాక్యాలు రూపొందించాల్సి ఉంటుంది.  ఒక్కో పదానికి కేటాయించే సమయం కేవలం పదిహేను సెకండ్లు.  
 గ్రూప్  టెస్ట్: ఎనిమిది నుంచి పదిమంది అభ్యర్థుల మధ్యలో జరిగే గ్రూప్ టెస్ట్‌లో  నిర్ణీత సంఘటనలకు సంబంధించి ప్లానింగ్, డిస్కషన్, డిబేట్స్ ఉంటాయి.  
 అకాడెమీల్లో ఇలా :
  రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తే త్రివిధ దళా ల్లో అవకాశం  చేజిక్కించుకున్నట్లే. అయితే దీనికి ముందు గా ఆ దళాలకు ఉపయోగపడే విధంగా  కఠోర శిక్షణనిస్తా రు. ఇండియన్ మిలటరీ అకాడెమీ (డెహ్రాడూన్)లో 18 నెలలు;  నేవల్ అకాడెమీలో సుమారు 17 నెలలు; ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో 18 నెలలు;  ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడె మీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది.  
 ఈ  శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్ హోదాలో ప్రవేశించవచ్చు.  నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్-లెఫ్ట్‌నెంట్ హోదా లభి స్తుంది.  ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభం లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు  చేపడతారు.  
 ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు  కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు. ప్రారంభంలోనే * 15,600 - 39,100  (గ్రేడ్‌పే * 5400) జీతం, ఇతర అలవెన్సులు అందుకోవచ్చు. ఇక.. ఒక్కసారి  కమిషన్డ్ హోదాలో త్రివిధ దళాల్లో అడుగు పెట్టారంటే.. ప్రతిభ పోరాట పటిమ  ప్రామాణికాలుగా పదోన్నతులు సొంతం చేసుకోవచ్చు. ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ హోదాతో  చేరిన వారు ఆరేళ్లకే మేజర్ స్థాయికి చేరుకోవచ్చు. అదే విధంగా మిగతా రెండు  విభా గాల్లో కూడా టైంస్కేల్ ప్రాతిపదికగా పదోన్నతులు పొందవచ్చు. 
 బ్యాచిలర్ డిగ్రీతోనే :
  కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు హాజరవ్వాలంటే కనీస అర్హత బ్యాచిలర్  డిగ్రీ ఉత్తీర్ణత. ఒక్క నేవల్ అకాడెమీకి మాత్రం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్  డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అర్హత, వయో పరిమితి వివరాలు.. 
 విభాగం 	అర్హత	వయో పరిమితి
 ఐఎంఏ అండ్ ఓటీఏ	బ్యాచిలర్ డిగ్రీ	2-1-1988; 1-1-1993 మధ్యలో జన్మించాలి
 ఇండియన్ నేవల్ అకాడెమీ	బ్యాచిలర్ ఇంజనీరింగ్	2-1-1990; 1-1-1993 మధ్యలో జన్మించాలి
  ఎయిర్ ఫోర్స్ అకాడెమీ	బ్యాచిలర్ డిగ్రీ 	2-1-1989; 1-1-1993 మధ్యలో జన్మించాలి
 	(10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదవాలి) 
  నోట్: ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న వారు, ఫలితాల కోసం  ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ  పూరె్తై.. అకాడెమీల్లో అడుగు పెట్టే సమయానికి సర్టిఫికెట్లను అందజేయాలి. 
  ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలోని షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళల నాన్  టెక్నికల్ కోర్సు మినహా మిగతా విభాగాలకు.. కేవలం అవివాహిత పురుషులు మాత్రమే  అర్హులు. ఎస్‌ఎస్‌సీ మహిళల నాన్ టెక్నికల్ కోర్సుకు 2-1-1987 నుంచి  1-1-1993 మధ్యలో జన్మించిన అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు. 
 పరీక్ష ఇలా 
  సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిల టరీ, నేవల్, ఎయిర్ ఫోర్స్  అకాడెమీ ఔత్సాహికులకు ఒక విధంగా.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ)  ఔత్సాహి కులకు మరోవిధంగా ఉంటుంది. ఆ వివరాలు.. 
 మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రాత పరీక్ష
 పేపర్-1 ఇంగ్లిష్ - 100 మార్కులు
 పేపర్-2 జనరల్ నాలెడ్జ్ - 100 మార్కులు
 పేపర్-3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ - 100 మార్కులు   
 ఓటీఏ పరీక్ష విధానం
 పేపర్-1 ఇంగ్లిష్ - 100 మార్కులు
 పేపర్-2 జనరల్ నాలెడ్జ్ - 100 మార్కులు 
 ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టు ల్లో పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు. సబ్జెక్ వారీ విశ్లేషణ..   
  జనరల్ ఇంగ్లిష్: అభ్యర్థుల్లో ఇంగ్లిష్ ప్రాథమిక పరిజ్ఞా నాన్ని  పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా కరెక్షన్ ఆఫ్  సెంటెన్సెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్, వర్డ్  యూసేజ్ వంటి వాటిపై దృష్టి సారించడం మేలు. వీటితోపాటు యాక్టివ్, ప్యాసివ్  వాయిస్, టెన్సెస్, ప్యాసేజ్ రీడింగ్, వాటిలోంచి కీలకాం శాలను పసిగట్టే  నేర్పు ఉంటే ఈ విభాగంలో రాణించడం తేలికే. దీనికోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ,  ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వంటి పుస్తకాలు చదవడం ఉపక రిస్తుంది. 
  జనరల్ నాలెడ్జ్: భారత చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్ని  రంగాల్లో (సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, పాలిటీ)  ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా చరిత్ర కు  సంబంధించి భారత స్వాంతంత్రోద్యమంపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదే  విధంగా రాజ్యాంగా నికి సంబంధించి ముఖ్యమైన సవరణలు -వాటి ఉద్దేశా లు;  రాజ్యాంగ స్వరూపం-లక్షణాలు; సమకాలీన మార్పు లపై దృష్టి సారించాలి. 
  జాగ్రఫీలో.. ప్రాథమికంగా భారత భౌగోళిక సరిహద్దులు, పర్వతాలు- అగాథాలు;  నదులు- పరీవాహక ప్రాంతాలు- ప్రాజెక్టులు - డ్యాంలు; సహజ వనరులు వంటి  అంశాలపై ప్రిపరేషన్ లాభిస్తుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా  సమకాలీన అంశాల పైనే ప్రశ్నలడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులు  ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన తాజా పరిణా మాలు (క్షిపణి పరీక్షలు-  ప్రయోగించిన తేదీలు- వాటి పరిధులు, రక్షణ శాఖలో నియామకాలు, భారత్ యుద్ధా  లు-ప్రత్యర్థులు-సమయం-విజేతలు తదితర వివరాలు) తెలుసుకోవడం మంచిది.  
  మ్యాథమెటిక్స్: వాస్తవానికి సీడీఎస్ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ  మ్యాథమెటిక్స్‌గా పేర్కొన్నారు. ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్  అంశాలను ప్రశ్న లుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి ఇంటిజ ర్స్, నంబర్  సిస్టమ్, రియల్ నంబర్స్, దూరం-కాలం; కాలం- పని; శాతాలు; వడ్డీ రేట్లు; లాభ  నష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. 
 ఇక అల్జీబ్రాలో  రిమైండర్ థీరమ్, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం; పాలినామియ ల్ థీరమ్స్, క్వాడ్రాటిక్  ఈక్వేషన్స్, రూట్స్ అండ్ కో-ఎఫి షియెంట్స్ తదితర అంశాలపై అధ్యయనం చేయాలి.  అదే విధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్,  స్టాటిస్టిక్స్ సంబంధ ఫార్ములాలు, సిద్ధాం తాలు, భావనలు తెలుసుకోవాలి. 
 సీడీఎస్‌ఈ (1)- 2011 సమాచారం
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
 పరీక్ష తేదీ: 13-02-2011
 దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2010
 వెబ్‌సైట్: 
www.upsc.gov.in